ఓ మొక్క నాటి.. రోజాకు ‘హేట్సాప్’​ చెప్పిన ‘జబర్దస్త్’​ ఫేమ్​ హైపర్​ ఆది

  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్త కార్యక్రమం
  • ప్రేమతో కుక్కలను పెంచే వాళ్లందరూ మొక్కలనూ పెంచాలి
  • ఈ బాధ్యతనూ సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న రోజా ‘స్ట్రాంగెస్ట్ ఉమెన్’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ‘జబర్దస్త్’ ఫేమ్ హైపర్ ఆది ఓ మొక్క నాటాడు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ, మొక్కలు పెంచాలని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని, ఇది ఎవరికి వారే చేయాల్సిన కార్యక్రమం అని తాను అనుకుంటున్నానని అన్నాడు. ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి ఇంట్లో ప్రేమతో కుక్కలను పెంచుకుంటున్నారని, వాళ్లందరూ కుక్కలతో పాటు మొక్కలను కూడా పెంచాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

ఏం పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్నారని, దీంతో పాటు ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటుండాలనే నిబంధన కూడా పెడితే భారత్  కచ్చితంగా ‘గ్రీన్ ఇండియా’ అవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, పెద్దవాళ్ల విషయానికొస్తే, కనిపెంచిన పిల్లలు భవిష్యత్ లో వారికి నీడనిస్తారో లేదో తెలియదు గానీ, ఈ కనిపించే మొక్కలు మాత్రం కచ్చితంగా నీడనిస్తాయని అన్నారు.

‘రోజా వనం’ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే దానికి కారణం రోజా గారు’ అని ప్రశంసించారు. ఆమెకు పేరు తీసుకొచ్చిన సినీ జీవితాన్ని, ఆ పేరుకు ఓ బలాన్ని ఇచ్చిన రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న ‘స్ట్రాంగెస్ట్ ఉమెన్’గా రోజాను అభివర్ణించాడు. ‘ఒక అమ్మగా తన పిల్లలకు, భార్యగా తన భర్తకు, ఎమ్మెల్యేగా ప్రజలకు, జడ్జిగా మాకు’ ఉన్న రోజా, ఇన్ని బాధ్యతల మధ్యలో మొక్కలు పెంచే బాధ్యతను కూడా  తీసుకుని సక్సెస్ చేశారంటే ‘రోజా గారికి హేట్సాఫ్ చెప్పాలి’ అని ప్రశంసించాడు. అలాగే, ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురు శేఖర్ మాస్టర్, వర్షిణి, ప్రదీప్ లకు  తాను సవాల్ విసురుతున్నట్లు చెప్పాడు.


More Telugu News