‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీని ఐదు జోన్లుగా విభజించి పెద్దరెడ్డిలకు అప్పగించారు: వర్ల విమర్శలు

  • ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని వైసీపీ చూస్తోంది
  • మంత్రులను జగన్ బెదిరిస్తున్నారు
  • దీనిని సుమోటోగా న్యాయస్థానాలు తీసుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావించి, ఏపీని ఐదు జోన్లుగా విభజించి ఐదుగురు పెద్దరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారని వైసీపీపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచేలా చూడాలంటూ మంత్రులను సీఎం జగన్ బెదిరించారని ఆరోపించారు. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రాకపోతే రాజీనామా చేయాలని వారిని హెచ్చరించడం అప్రజాస్వామికమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ మంత్రులను జగన్ బెదిరించడాన్ని సుమోటోగా తీసుకోవాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్ కూడా ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరాలని డిమాండ్ చేశారు.


More Telugu News