కరోనాపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో అత్యవసర సమావేశం

  • ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ఆధ్వర్యంలో సమావేశం
  • కరోనా ప్రభావంపై చర్చ
  • థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ ఉనికి వెల్లడవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తెలుగు ఫిలిం చాంబర్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, 'మా' సభ్యులు హాజరయ్యారు.

కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, షూటింగ్ లు నిలిపివేయడం, థియేటర్ల మూసివేత, అవుట్ డోర్ షూటింగుల్లో తీసుకోవాల్సిన తప్పనిసరి జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. కాగా, థియేటర్ల మూసివేతపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తికి థియేటర్లే ఎక్కువగా కారణమవుతాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై కార్యాచరణను త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.


More Telugu News