జగన్ వైరస్ వల్ల రూ.2 లక్షల కోట్ల ఆస్తులు కుప్పకూలిపోయాయి: దేవినేని ఉమ

  • రైతుల శ్రమను దళారులకు దోచిపెడుతున్నారంటూ ఆగ్రహం
  • రాష్ట్రంలో పల్లెలు కన్నీరుపెడుతున్నాయని వ్యాఖ్యలు
  • కొడాలి నానీని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్
రైతుల శ్రమను వైఎస్ జగన్ ప్రభుత్వం దళారులకు దోచిపెడుతోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. జగన్ వైరస్ వల్ల ఏపీలో రూ.2 లక్షల కోట్ల ఆస్తులు కుప్పకూలిపోయాయని, రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని పేర్కొన్నారు. రూ.3 వేల కోట్ల లిక్కర్ డబ్బులు సరిపోవడంలేదని ఇప్పుడు ధాన్యం రైతుల డబ్బుపై ప్రభుత్వం కన్నేసిందని మండిపడ్డారు. ఇది వెయ్యి కోట్ల కుంభకోణం అని ఆరోపించిన ఉమ, దీనికి బాధ్యుడైన మంత్రి కొడాలి నానీని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News