లోక్ సభలో కరోనాపై ఆందోళన వ్యక్తం చేసిన గల్లా జయదేవ్

  • కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ పాకుతోంది
  • దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఏ మేరకు పడబోతోంది?
  • ప్రపంచ ఆర్థిక సంక్షోభం రానుందని ప్రజలు అనుకుంటున్నారు 
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ పాకుతోంది. ఈ నేపథ్యంలో, ప్రజలు ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఇతర దేశాలకు వెళ్లడం మానేశారు. పలు విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను ఆపేస్తున్నాయి. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక పరిశ్రమ కుదేలైంది. మన దేశంలో కూడా ప్రజలు రెస్టారెంట్లు, మాల్స్, సినిమాలకు వెళ్లడం వంటి పనులు చాలా మటుకు తగ్గించేశారు. వివిధ రకాల కొనుగోళ్లు పడిపోయాయి. కరోనా భయాలతో ఓ వైపు స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. వీటన్నింటి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది.

ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ఈరోజు ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంత మేరకు పడబోతోందో మనమంతా అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు అంచనా వేస్తున్నారని అన్నారు.


More Telugu News