'పలాస 1978' దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్

  • 'పలాస 1978' ప్రివ్యూ షో చూసిన అల్లు అరవింద్ 
  • దర్శకుడికి అభినందనలు 
  • 'గీతా ఆర్ట్స్ 2'లో అవకాశం
రక్షిత్ .. నక్షత్ర అనే కొత్త హీరో హీరోయిన్లతో దర్శకుడు కరుణ కుమార్ 'పలాస 1978' సినిమాను రూపొందించాడు. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాను , ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ను .. బన్నీ వాసును ఆహ్వానించి ఈ సినిమా ప్రివ్యూ షో ను చూపించారు.

ప్రివ్యూ షో చూసిన అల్లు అరవింద్ .. దర్శకుడు కరుణ కుమార్ ను అభినందించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన ఈ సినిమాను ఎంతో సహజంగా చిత్రీకరించాడంటూ ప్రశంసించారు. కరుణ కుమార్ కి మంచి భవిష్యత్తు ఉందంటూ మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఆయనతో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అడ్వాన్స్ గా కరుణ కుమార్ కి తన చేతుల మీదుగా చెక్ ను అందించారు. దాంతో కరుణ కుమార్ తన రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ 2లో చేయడమనేది ఖరారైపోయింది.


More Telugu News