వేతన జీవులకు చేదువార్త.. పీఎఫ్‌ వడ్డీరేటు తగ్గింపు

  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో కీలక నిర్ణయం
  • 2019 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం
  • 2020 ఆర్థిక సంవత్సరంలో 15 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు
  • 8.50 శాతంగా నిర్ణయం
ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) వడ్డీ రేట్లపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)  కీలక ప్రకటన చేసింది. పీఎఫ్‌ వడ్డీరేటు తగ్గింపుపై  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. అయితే, ఈ వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 15 బేసిస్‌ పాయింట్లు  తగ్గిస్తూ  8.50 శాతంగా నిర్ణయించారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి  పీఎఫ్‌ వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ కూడా తెలిపారు. కాగా, పీఎఫ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును మార్చకూడదని కార్మికశాఖ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 8.65 శాతాన్ని యథాతథంగా ఉంచనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, వడ్డీ రేటును తగ్గిస్తూ వేతనజీవులకు చేదువార్త చెప్పారు.


More Telugu News