ఆ రోజున సెట్లోనే గుమ్మడి గారిపై ఎన్టీఆర్ కోప్పడ్డారు: నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు
- అది ఎన్టీ రామారావుగారి సినిమా
- సెట్లో గుమ్మడిగారు అలా చేశారు
- మళ్లీ ఆయన సెట్ వదిలి వెళ్లలేదన్న చిట్టిబాబు
తాజా ఇంటర్వ్యూలో నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ, "ఈ తరం ఆర్టిస్టుల్లో కొంతమంది కారవాన్ లో తమ స్నేహితులను తీసుకొస్తున్నారు. షాట్ గ్యాపులో వాళ్లతో కలిసి సరదాగా కార్డ్స్ ఆడుతున్నారు. తాము చేస్తున్నది తప్పు అని వాళ్లు అనుకోవడం లేదు. చాలాకాలం క్రితం ఒక సినిమా షూటింగులో, షాట్ గ్యాపులో గుమ్మడిగారు రేడియాలో క్రికెట్ కామెంట్రీ వింటున్నారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో చేసే సీన్ కి ఆయన రావాలి.
కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చినా, గుమ్మడి గారు 'ఒక్క నిమిషం' అని చెప్పేసి కామెంట్రీ వింటున్నారు. 'గవాస్కర్ సెంచరీ కొట్టాడు..' అంటూ ఆయన నవ్వుతూ రాగానే, "మీరు పెద్దవారు .. ఇలా చేయడం కరెక్ట్ కాదు. గవాస్కర్ ఎన్ని కొడితే మనకెందుకు? లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేయించిన నిర్మాత ఇక్కడే వున్నారు. మనమందరం ఆయన దగ్గర పనిచేస్తున్నాం. ఆయన సమయాన్ని వృథా చేయకూడదనే బాధ్యత మనకి ఉండాలి" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి ఆ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ గుమ్మడిగారు సెట్ వదిలి వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు.