సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ గా తొలి సారి ఓ మహిళ.. బాధ్యతలు స్వీకరిచిన సంచయిత

  • బాధ్యతలు స్వీకరించిన సంచయిత
  • ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంచయిత
  • ట్రస్ట్ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ (మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌) ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును సీఎం జగన్ నియనించారు. ఈ ఉదయం ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు.  ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధిగా ఆమె కొనసాగుతున్నారు.

నిన్నటి వరకూ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక గజపతిరాజును తొలగిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం విజయనగరం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆ వెంటనే సంచయితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా, 1958లో నెలకొల్పిన ట్రస్ట్ కు పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్ గా ఉండగా, ఆపై 1994లో ఆయన మరణానంతనం ఆనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. ఆపై 2016లో అశోక గజపతి రాజు బాధ్యతలు అందుకున్నారు. సింహాచలం దేవస్థానానికి ఆనువంశిక ధర్మకర్తగానూ ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ట్రస్ట్  బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా సంచయిత రికార్డు సృష్టించారు.


More Telugu News