డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్న ఊబర్ డ్రైవర్.. అప్పుడామె ఏం చేసిందంటే!
- పుణె నుంచి ముంబయి వస్తుండగా ఘటన
- నిద్ర మత్తులో డివైడర్‌ను ఢీకొట్టిన చోదకుడు
- దీంతో అప్రమత్తమై తానే కారు నడిపిన మహిళ
క్షేమంగా గమ్యస్థానం చేర్చాల్సిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో జోగుతుండడమేకాక, ప్రమాదం అంచు వరకు తీసుకువెళ్లడంతో ఆశ్చర్యపోయిన మహిళ తానే కారు నడుపుతూ గమ్యస్థానం చేరుకున్న ఘటన ఇది. డ్రైవర్ నిర్వాకంపై ఆమె వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ఇప్పుడిది వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...గతనెల ఇరవై ఒకటో తేదీన తేజస్విని దివ్యనాయక్ (28) అనే మహిళ పుణె నుంచి ముంబయి వచ్చేందుకు ఊబర్‌లో క్యాబ్ బుక్ చేసింది.
కారు ఎక్కిన ఆమె డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో మందలించింది. ఫోన్ పక్కన పెట్టేసిన డ్రైవర్ కారు నడుపుతూ నిద్రలోకి జారుకుంటూ ఉండడాన్ని ఆమె గమనించింది. దీంతో ఆందోళన చెందిన ఆమె అతన్ని అప్రమత్తం చేద్దామనేలోపే కారు డివైడర్‌ను మెల్లగా డీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఇద్దరికీ ఏమీ కాలేదు.
దీంతో పరిస్థితిని ఊహించిన ఆమె డ్రైవర్‌ను వెనుక సీట్లో కాసేపు పడుకోవాలని చెప్పి తానే స్టీరింగ్ చేతుల్లోకి తీసుకుంది. ముంబయి వచ్చేలోగా డ్రైవర్ పడుకోవడాన్ని వీడియోతీసి ఊబర్ సంస్థకు పంపడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ వైరల్‌గా మారింది. మరోవైపు వీడియో చూసిన ఊబర్ సంస్థ సదరు డ్రైవర్‌ను విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించింది.