'క్రాక్' సినిమా నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్టులుక్

  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ 
  • నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో వరలక్ష్మీశరత్ కుమార్
  • సంగీత దర్శకుడిగా తమన్  
రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఈ రోజున వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'క్రాక్' సినిమాలో 'జయమ్మ'గా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్టులుక్ ను వదిలారు.  

వరలక్ష్మీ శరత్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలిన ఈ పోస్టర్లో, ఆమె లుక్ చాలా కొత్తగా వుంది. ఆమె లుక్ చూస్తుంటే, గ్రామీణ నేపథ్యంలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రనే పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలకి వరలక్ష్మీ శరత్ కుమార్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. అందువలన ఈ సినిమాలోను ఆమె అదే తరహా పాత్రను చేస్తోందని అనుకోవచ్చు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


More Telugu News