చిరంజీవి గారు చెప్పింది నిజమే: నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు
- చిరంజీవిగారు స్పందించిన తీరు బాగుంది
- కారవాన్ల వలన ఖర్చు ఎక్కువ
- సమయం వృథా అవుతుందన్న చిట్టిబాబు
ఇటీవల చిరంజీవి ఒక వేదికపై మాట్లాడుతూ, సినిమా షూటింగుల్లో కారవాన్ సంస్కృతిపట్ల కాస్తంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ విషయంపై నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ .. "కారవాన్స్ లేనప్పుడు అందరూ చెట్లకింద కూర్చుని మాట్లాడుకోవడం, కారవాన్స్ వచ్చిన తరువాత షాట్ పూర్తికాగానే అందులోకి వెళ్లిపోవడం ఈ రెండింటినీ చిరంజీవి చూశారు.
షూటింగు సమయంలో అంతా ఒక చోట ఉన్నట్టయితే, ఆ తరువాత తీయబోయే సీన్ పై అందరికీ ఒక స్పష్టత వస్తుంది. దాంతో ఎవరికివారు ఆ సీన్లో తాము ఎలా చేయాలా అనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చేస్తారు. అందరూ కూడా ఒకే మూడ్ లో వుంటారు. కారవాన్ లోకి వెళ్లి కూర్చోవడం వలన, ఏకాగ్రత దెబ్బతింటుంది. అంతేకాదు .. అసిస్టెంట్ డైరెక్టర్లు మాటిమాటికి వెళ్లి పిలవడం వలన సమయం వృథా అవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిస్తే రాకుండా, కో డైరెక్టర్ గానీ .. డైరెక్టర్ గాని పిలవాలనే ఆర్టిస్టులు కూడా వున్నారు. కారవాన్ ల వలన ఖర్చు ఎక్కువవుతుంది . సమయం వృథా అవుతుంది" అని చెప్పుకొచ్చారు.