'మా'కు సెలవు పెట్టిన నరేశ్... యాక్టింగ్ అధ్యక్షుడిగా బెనర్జీ!

  • 41 రోజులు సెలవు పెట్టిన నరేశ్
  • బెనర్జీని ఎన్నుకున్న సభ్యులు
  • హాజరైన చిరంజీవి, కృష్ణంరాజు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) యాక్టింగ్ ప్రెసిడెంట్ గా సీనియర్ నటుడు బెనర్జీ ఎన్నికయ్యారు. మా అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ 41 రోజుల పాటు సెలవు పెట్టిన నేపథ్యంలో బైలాస్ ప్రకారం కమిటీ బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. క్రమశిక్షణా కమిటీ, ఈసీ సభ్యులు కలిసి బెనర్జీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జయసుధ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నరేశ్ సెలవు నుంచి తిరిగి వచ్చేంత వరకూ బెనర్జీ పదవీ కాలం కొనసాగుతుంది.


More Telugu News