తిరుమలలో కనిపించని భక్తుల రద్దీ!

  • ఇంటర్ పరీక్షలు మొదలు కావడంతో మోస్తరు సంఖ్యలోనే భక్తులు
  • ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు
  • నిన్న స్వామిని దర్శించుకున్న 62,731 మంది
భక్తుల రద్దీ లేక తిరుమల కొండలు వెలవెలబోతున్నాయి. ఇంటర్ పరీక్షలు మొదలు కావడం, ఆపై వరుసగా మిగతా పరీక్షలన్నీ ఉండటంతో, స్వామి దర్శనానికి ఓ మోస్తరు సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. ఈ ఉదయం స్వామి సర్వదర్శనానికి ఒక్క కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచివున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం సహా అన్ని రకాల దర్శనాలూ మూడు గంటల్లోపే పూర్తవుతున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు స్వామిని 62,731 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.


More Telugu News