సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమన్నాపై సమంత కాంప్లిమెంట్స్ 
  • 'మా' తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ 
  • కొత్త దర్శకుడికి అల్లు అరవింద్ ఆఫర్  
 *  అందాలతార సమంత మరో హీరోయిన్ తమన్నాపై ప్రశంసలు కురిపించింది. 'గత పదిహేనేళ్లుగా నేను చూస్తున్న అద్భుతమైన అందాలలో తమన్నా ఒకరు' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన తమన్నా కూడా సమంతను పొగుడుతూ, 'నువ్వు నాకు ఎన్నో విషయాలలో ఇన్స్పిరేషన్' అంటూ కామెంట్ చేసింది.  
*  కొన్ని నాటకీయ పరిణామాల నడుమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ నటుడు బెనర్జీ బాధ్యతలు స్వీకరించారు. మా అధ్యక్షుడు నరేశ్ 41 రోజుల సెలవుపై వెళుతుండడంతో కార్యవర్గం తాత్కాలిక అధ్యక్షునిగా బెనర్జీని ఎంపిక చేసింది.  
*  'పలాస 1978' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న కరుణ కుమార్ అనే యువకుడికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సంస్థలో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నిన్న 'పలాస 1978' చిత్రాన్ని చూసిన అల్లు అరవింద్ ఎంతగానో ఇంప్రెస్ అయి, వెంటనే అతనికి ఆఫర్ ఇచ్చారట.


More Telugu News