ఇక ఈసారి వచ్చేదే చివరి డెత్ వారెంట్!: నిర్భయ తల్లి
- క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు
- వారికి ఉరిశిక్ష అమలైతేనే తనకు మనశ్శాంతని వ్యాఖ్య
- ఉరిశిక్ష అమలయ్యే వరకు విశ్రమించబోనని ప్రతిన
నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు నిర్భయ తల్లి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ పిటిషన్ బుధవారం తిరస్కరణకు గురైన అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఈసారైనా దోషులను ఉరి తీస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.
చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని బయటపడేందుకు దోషులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈసారి వచ్చే డెత్ వారెంటే చివరిది అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. వారికి ఉరిశిక్ష పడేంత వరకు తనకు మనశ్శాంతి ఉండదన్నారు. తమలాంటి కుటుంబాలు దేశంలో వేల సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్న బాధితురాలి తల్లి.. ప్రపంచం మొత్తం దోషుల ఉరినే కోరుకుంటోందని, వారికి ఉరి పడేవరకు విశ్రమించబోనని ఆమె స్పష్టం చేశారు.