‘కరోనా’పై ఏ సమాచారం కావాలన్నా ‘104’ సేవలను వినియోగించుకోండి: మంత్రి ఈటల

  • ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఈటల రాజేందర్
  • ‘స్వైన్ ఫ్లూ‘నే ఎదుర్కొన్నాం..‘కరోనా’ విషయంలో భయపడొద్దు
  • ఐసోలేషన్ సేవలకు అన్ని మెడికల్ కాలేజీలు ముందుకొచ్చాయి
కరోనా వైరస్ పై ఏ సమాచారం కావాలన్నా ‘104’ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని గుర్తుంచుకోవాలని, ‘కరోనా’ వచ్చిన వ్యక్తికి సంబంధం ఉన్న వాళ్లందరికీ ఈ వ్యాధి సోకదని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.

అత్యంత తీవ్ర ప్రభావం చూపిన ‘స్వైన్ ఫ్లూ‘నే ఎదుర్కొన్నామని, ‘కరోనా’ విషయంలో బెంబేలెత్తాల్సిన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. కరోనా బాధితులకు ఐసోలేషన్ సేవలు అందించేందుకు అన్ని మెడికల్ కాలేజీలు ముందుకు వచ్చాయని, వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రతి మెడికల్ కళాశాలలో 50 మందికి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.


More Telugu News