గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్

  • రాజ్ భవన్ లో తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్
  • బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించనున్న గవర్నర్
  • ఆ ప్రసంగ ప్రతిని ఆమెకు అందజేసిన కేసీఆర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని సీఎం కేసీఆర్ కలిశారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్ భవన్ లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని ఆమెకు అందజేశారు.

కాగా, ఈ నెల 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ హాలులో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.


More Telugu News