సీఎస్‌కే నన్ను చాలా మార్చింది: ధోనీ
- మంచి క్రికెటర్‌గా, మనిషిగా తీర్చిదిద్దింది
- కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో సాయం చేసింది
- నాపై ప్రేమతోనే ఫ్యాన్స్ తాలా అని పిలుస్తారు
వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ పదమూడో సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిసిన ధోనీ చెన్నైలో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనీ ఆ జట్టును లీగ్‌లో అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిపాడు.
సీఎస్‌కే జట్టు తనను నాణ్యమైన ప్లేయర్‌గా మార్చిందని ధోనీ అంటున్నాడు. మైదానం లోపల, బయట తనకు ఎదురైన క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేందుకు సాయం చేసిందని తెలిపాడు. అలాగే, ఒక మనిషిగా, క్రికెటర్‌గా తనను ఎంతగానో మార్చిందని జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక, ఫ్యాన్స్ అందరూ తనను తాలా అని పిలవడంపై ధోనీ స్పందించాడు. ప్రజలు తనపై ప్రేమ, గౌరవంతోనే అలా పిలుస్తున్నారని చెప్పాడు. చెన్నైకి ఎప్పుడు వచ్చినా తన పేరు పెట్టి పిలవరని, అందరూ తాలా అని అంటారని తెలిపాడు.