కరోనా వైరస్ కు రామ్ గోపాల్ వర్మ సలహా!

  • అందరినీ చంపుకుంటూ వెళ్లే బదులు ఒక విషయం తెలుసుకో
  • పరాన్నజీవివైన నీవు మాతోపాటే చస్తావ్
  • నీకు నా విన్నపం ఏమిటంటే... బతుకు, బతికించు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతున్న తరుణంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా ఈసారి వైరస్ ను టార్గెట్ చేశారు. 'డియర్ కరోనా వైరస్... మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్లేబదులు ఒక విషయం గురించి తెలుసుకో. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్. నీవు నా మాటలను నమ్మకపోతే... వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో. నీకు నా విన్నపం ఏమిటంటే... బతుకు, బతికించు. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు వర్మ ట్వీట్ కు ఓ నెటిజెన్ ఆసక్తికరంగా రెస్పాండ్ అయ్యాడు. 'కరోనా వైరస్ కు ట్విట్టర్ అకౌంట్ లేదు. నీవు చైనా వెళ్లి, ఆ వైరస్ ను ఎక్కించుకో. అప్పుడు అది నీ మాట వింటుంది' అంటూ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


More Telugu News