అమెరికాలో అమెజాన్ ఉద్యోగికి కరోనా
- వాషింగ్టన్‌లోని ప్రధాన కార్యాలయంలో గుర్తింపు
- బాధితుడితో కాంటాక్ట్ అయిన ఉద్యోగులకు పరీక్షలు
- వెల్లడించిన సంస్థ
ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్‌కు కూడా కరోనా ఎఫెక్ట్ తగిలింది. అమెరికాలో పని చేస్తున్న ఆ సంస్థకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అమెజాన్ స్వయంగా వెల్లడించింది. వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం.
అనారోగ్యం కారణంగా గత వారం కంపెనీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిన సదరు ఉద్యోగి తిరిగి ఆఫీస్‌కు రాలేదని, అతను కరోనాతో బాధపడుతున్నాడని అమెజాన్ తమ ఇంటర్నల్ మెమోలో తెలిపింది. కరోనా బారిన పడ్డ ఉద్యోగిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచామని, అతను కోలుకునేందుకు అన్నివిధాలుగా సాయం చేస్తామని అమెజాన్ చెప్పింది. అలాగే, అతనితో కాంటాక్ట్ అయిన మిగతా ఉద్యోగులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.