నిర్భయ దోషి పవన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

  • క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి
  • ‘క్యురేటివ్’ తిరస్కరణ తర్వాత మెర్సీ పిటిషిన్ పెట్టుకున్న పవన్
  • నిర్భయ దోషుల డెత్ వారెంట్లపై కొనసాగుతున్న ’స్టే‘
నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఆ తర్వాత తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతికి పవన్ పిటిషన్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా, నిర్భయ దోషులు నలుగురికి ఈ నెల 3న ఉరితీయాల్సి ఉన్నప్పటికి పవన్ పిటిషన్ మేరకు పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ‘స్టే‘ కొనసాగనుంది.


More Telugu News