హైదరాబాద్‌లో 'కరోనా' కలకలంతో ఫంక్షన్‌లను రద్దు చేసుకుంటున్న వైనం!
- కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భయం
- 25వ పెళ్లిరోజు వేడుకను రద్దు చేసుకున్న దంపతులు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ రద్దు
- విశాఖలో నౌకాదళ విన్యాసాలు 'మిలాన్ –2020' కూడా వాయిదా
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దని వైద్యులు సూచిస్తోన్న నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు పంక్షన్‌లను వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని చింతల్‌లో దంపతులు గోపాల్ రెడ్డి, భారతి తమ 25వ పెళ్లిరోజు వేడుకను జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
రేపు ఈ వేడుక జరగాల్సి ఉండగా ఫంక్షన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వారు తమ బంధుమిత్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇప్పటికే వారు ఫంక్షన్ హాల్‌తో పాటు కేటరింగ్ వంటి అన్ని బుకింగ్‌లు చేసుకున్నారు. ఇటువంటి ఘటనలే పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి.
కాగా, విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాలు 'మిలాన్ -2020'ని కూడా వాయిదా వేశారు. ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పాల్గొనేందుకు పలు దేశాలను ఆహ్వానించారు. దాదాపు 30 దేశాలు ఇందుకు అంగీకారం కూడా తెలిపాయి. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో 'మిలాన్ -2020'ని వాయిదా వేశారు.