అల్లు అర్జున్ చాలా స్ట్రాంగ్.. ఎనర్జిటిక్!: హృతిక్ రోషన్ ప్రశంసల జల్లు
- టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డ్యాన్స్‌పై హృతిక్ స్పందన
- బన్నీ ఎనర్జిటిక్, స్ఫూర్తిదాయకం
- డ్యాన్స్‌కు ముందు బన్నీ, విజయ్ ఏం తింటారో తెలుసుకోవాలనుంది
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డ్యాన్స్‌పై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల జల్లు కురిపించాడు. బన్నీ ఎనర్జిటిక్, స్ఫూర్తిదాయకం, స్ట్రాంగ్ అని ఆయన కొనియాడారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది హీరోల గురించి ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
అలాగే, హీరో విజయ్ గురించి హృతిక్ మాట్లాడుతూ.. వీరు రహస్యంగా ఏదో తింటున్నారని, ప్రతిరోజు ఉత్సాహంతో ఉంటారని అన్నాడు. డ్యాన్స్‌కు ముందు వీళ్లు ఏం తింటారో తెలుసుకోవాలని ఉందని అన్నారు. డ్యాన్స్ చేయడానికి చాలా ప్రాక్టీస్ అవసరమని, ఆపై దాని ఫలితాన్ని వదిలేయాలని చెప్పాడు.
డ్యాన్స్ ను ఆస్వాదిస్తూ చేయాలని హృతిక్ అన్నాడు. మనం డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తే ముఖంలో ఆ ఫీలింగ్స్ కనిపిస్తాయని చెప్పాడు. అప్పుడు ఒకవేళ మూమెంట్స్ తప్పైనప్పటకీ సమస్యే ఉండదని తెలిపాడు. తాను ఇటీవల కాలంలో వచ్చిన ఒక్క దక్షిణాది సినిమాను కూడా చూడలేకపోయానని ఆయన చెప్పాడు. దక్షిణాది సినిమాల్లో టెక్నాలజీని అద్భుతంగా వాడుతున్నారని ఆయన కొనియాడాడు.