దెబ్బతిన్న విండ్ షీల్డ్...అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం
- ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
- కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోక్రాకు వెళ్తుండగా ఘటన
- వడగళ్ల వానకు దెబ్బతిన్న గ్లాస్
కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం ఒకటి కాసేపటికే వెనుదిరిగి అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నిన్న సాయంత్రం 15-536 నంబరుగల విమానం బ్యాగ్‌డోక్రాకు వెళ్లేందుకు గాల్లోకి లేచింది. కాసేటికి వడగళ్ల వాన పడడంతో విండ్‌షీల్డ్ దెబ్బతింది.
దీన్ని గుర్తించిన కెప్టెన్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ఈ విమానంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి అరూప్ బిస్వాస్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు’ అని తెలిపారు. కాగా, నిన్న వాతావరణం అనుకూలించక కోల్‌కతా నుంచి రాకపోకలు జరపాల్సిన పలు విమానాలు జాప్యం అయ్యాయి.