మెట్రో నగరాల్లో మహిళల కోసం 'సేఫ్‌ సిటీ ప్రాజెక్టు': కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • ఆయా నగరాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ కంట్రోల్‌ గదులు
  • విమెన్‌ పోలీస్‌ పెట్రోలింగ్‌, ఆశాజ్యోతి కేంద్రాలు
  • నిర్భయ నిధులతో ఏర్పాటుకు సన్నాహాలు
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ‘సేఫ్‌ సిటీ ప్రాజెక్టుకు’ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ మెసేజ్‌ పోస్టు చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ కంట్రోల్‌ గదులు, ఉమెన్‌ పోలీసు పింక్‌ పెట్రోల్స్‌, ఆశాజ్యోతి కేంద్రాల ఏర్పాటు, అభివృద్ధితోపాటు మహిళలకు ఉపయుక్తమయ్యే మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిర్భయ చట్టం నిధుల ద్వారా ఆయా కేంద్రాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.


More Telugu News