కరోనా ఎఫెక్ట్ : ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు

  • భయపెడుతున్న కోవిడ్ 19 
  • ఆ సమస్య ఏమీ లేదంటున్న నిర్వాహకులు 
  • దక్షిణాఫ్రికా సిరిస్ పైనా డౌటే

ఈ సీజన్లో ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ముప్పు భారత్ ను భయపెడుతోంది. పలుచోట్ల కరోనా కేసులు నమోదవుతున్న వార్తల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందేహమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్వాహకులు మాత్రం అటువంటిదేమీ లేదని, యథావిధిగా ఐపీఎల్ పండుగ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ 'ఐపీఎల్ పై కరోనా ప్రభావం లేదు. అయినప్పటికీ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఈనెల 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది' అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇటువంటి ప్రకటనే చేశారు. 'భారత్ లో క్రికెట్ సిరిస్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదు. కరోనా వైరస్ అంశం చర్చకు రాలేదు. అందువల్ల ఐపీఎల్ తోపాటు దక్షిణాఫ్రికా భారత్ పర్యటన యథావిధిగా సాగుతుంది' అంటూ గంగూలీ తెలిపారు.



More Telugu News