‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీకి పుట్టగతుల్లేకుండా వాలంటీర్లే చేస్తారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- చివరకు వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు విమర్శించారు
- మద్యం డోర్ డెలివరి చేశారని ఆరోపిస్తారా?
- ఆ విషయం నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే చంద్రబాబు, చివరకు వాలంటీర్లను వదల్లేదని, వారి గురించి ఆరోపణలు చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పెన్షన్లే కాకుండా మద్యం కూడా డోర్ డెలివరి చేశారని వాలంటీర్లపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ఆ విషయాన్ని నిరూపిస్తే తాము రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
టీడీపీ నేతలు మాట్లాడే ఇలాంటి పిచ్చిమాటలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఛీత్కరించడం ఖాయమని, పుట్టగతుల్లేకుండా వాలంటీర్లే చేస్తారని హెచ్చరించారు. పేదల కోసం పాటుపడుతున్న జగన్ కు అండగా ఉంటూ, అందుకు సంబంధించిన పనులను సక్రమంగా చేసి పెడుతున్న వాలంటీర్లను అభినందిస్తున్నానని, వాళ్లు ‘వాలంటీర్స్ కాదు వారియర్స్’ అంటూ ఆమె కితాబిచ్చారు.