‘కరోనా’ హైదరాబాద్ కు వచ్చిందన్న వార్తతో ఆందోళనకు గురయ్యా: చంద్రబాబునాయుడు

  • ఏపీకి కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి
  • ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..పరిశుభ్రత పాటించాలి
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ కు వచ్చిందన్న వార్త విని ఆందోళనకు గురయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీకి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

కరోనా వైరస్ పై ప్రజలకు సత్వర అవగాహన కలిగించాలని, ఒకవేళ ఎవరైనా ఈ వైరస్ బారిన పడితే చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో ఐదు నెలల క్రితం డెంగీ వ్యాధితో అనేక మంది చనిపోయారని, అదే నిర్లక్ష్యం మళ్ళీ పునరావృతం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ క్షణంలో అయినా సరే ‘కరోనా’ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు.


More Telugu News