ఎంత కావాల్సిన వాళ్లయినా నమస్కారంతో సరిపెట్టండి: మంత్రి ఈటల

  • ఇతరులతో కరచాలనం మానేయాలన్న ఈటల
  • ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచన
  • కరోనా మరణాలు మూడు శాతం కూడా లేవని వ్యాఖ్యలు
  • ఆందోళన అవసరం లేదని వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు మీదపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతరులతో కరచాలనం చేయడం దాదాపుగా మానేయాలని, ఎంతటి ఆప్తులైనా సరే నమస్కారంతో సరిపెట్టాలని పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. కరోనా వైరస్ ఎక్కువగా శీతల పరిస్థితుల్లోనే జీవిస్తుందని, మనవద్ద ఎక్కువగా వేడి వాతావరణం ఉన్నందున ఆ వైరస్ మనుగడ సాగించలేదని తెలిపారు. ఇప్పటివరకు కోవిడ్-19 సోకినవారిలో మూడు శాతం మరణాలు కూడా లేవన్న విషయాన్ని గమనించాలని, దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈటల అన్నారు.


More Telugu News