శ్రీలంక క్రికెటర్​కు గుర్తుండిపోయే రిటైర్మెంట్​ గిఫ్ట్​ ఇచ్చిన భారత అమ్మాయిలు

  • ఆటకు గుడ్‌బై చెప్పిన శ్రీలంక ఆల్‌రౌండర్‌‌ శశికళ
  • హర్మన్‌ప్రీత్ జెర్సీని ఆమెకు బహూకరించిన భారత్‌
  • భారత అమ్మాయిల మంచి మనసుపై ఐసీసీ హర్షం
భారత మహిళా క్రికెటర్లు ఆటతోనే కాదు మంచి మనుసుతో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో అమ్మాయిలు ఇప్పటికే సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇక, ఈ టోర్నీతో తన కెరీర్‌‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక వెటరన్‌ క్రికెటర్‌‌ శశికళకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు.

సోమవారం బంగ్లాదేశ్‌పై చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత శశికళ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆల్‌రౌండర్‌‌ శశికళ లంకను గెలిపించడంతో పాటు తన ఆఖరి ఆటను చిరకాల జ్ఞాపకంగా మార్చుకుంది. మ్యాచ్‌ తర్వాత లంక డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిన భారత క్రికెటర్లు స్మృతి మంధాన, శిఖా పాండే, జెమీమా రోడ్రిగ్స్‌ ఆమెకు ఓ జెర్సీని బహుమతిగా అందించారు. ఆ జెర్సీ భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ది. దానిపై భారత క్రికెటర్లందరూ సంతకం చేయడంతో పాటు శశికళకు ఆల్‌దిబెస్ట్ చెబుతూ మన జట్టు సందేశం కూడా రాసింది. ఈ ఫొటోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేసింది. ప్రత్యర్థి జట్టు క్రికెటర్‌‌పై భారత అమ్మాయిలు చూపించిన ప్రేమ పట్ల హర్షం వ్యక్తం చేసింది.


More Telugu News