టీ20 వరల్డ్​కప్‌ సెమీఫైనల్లో భారత్​ ప్రత్యర్థి ఎవరంటే..

టీ20 వరల్డ్​కప్‌ సెమీఫైనల్లో భారత్​ ప్రత్యర్థి ఎవరంటే..
  • గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న టీమిండియా
  • రెండో సెమీస్‌లో గ్రూప్‌–బి టాపర్‌‌ సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ
  • సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్ వర్షార్పణం
  • రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయింపు
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో అందరికంటే ముందు సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ సెమీస్‌ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిలు అమీతుమీ తేల్చుకోనున్నారు. గ్రూప్‌–బిలో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య జరగాల్సిన చివరి లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దాంతో, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు.

నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఏడు పాయింట్లతో గ్రూప్‌–బి టాపర్‌‌గా నిలిచింది. ఇక మూడు విజయాలు, ఒక ఓటమితో ఇంగ్లండ్‌ ఆరు పాయింట్లతో రెండో ప్లేస్‌కు పడిపోయింది. దాంతో, గ్రూప్‌–ఎలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌తో ఇంగ్లండ్ సెమీస్‌లో తలపడనుంది. గ్రూప్‌–ఎలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియాతో గ్రూప్‌–బి టాపర్‌‌ సౌతాఫ్రికా తలడపనుంది. ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో గురువారం జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కు ఇంగ్లండ్, భారత్‌ మధ్య తొలి సెమీస్‌ ఉంటుంది. మధ్యాహ్నం 1.30కు రెండో సెమీస్‌ మొదలవుతుంది.


More Telugu News