పెళ్లయిన వాళ్లతో సంబంధం పెట్టుకోవద్దు.. నేను చాలా వేదన అనుభవించా: సినీ నటి నీనా గుప్తా
- తొలుత భార్య అంటే ఇష్టం లేదంటాడు
- అతన్ని నమ్మి నీవు అతనితో ఏకాంతంగా గడుపుతావు
- పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి అతను దూరమవుతాడు
పెళ్లయిన వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు పెట్టుకోవద్దని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా హితవు పలికారు. తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, వాటి ద్వారా తాను నేర్చుకున్న గుణపాఠాలను అభిమానులతో ఆమె పంచుకున్నారు. జీవితంలో ఏ తోడు లేకపోయినా ఒంటరిగా బతకొచ్చని... కానీ, పెళ్లైన వ్యక్తితో సంబంధం మాత్రం పెట్టుకోవద్దని ఆమె సూచించారు.
పెళ్లైన వ్యక్తి తొలుత తన భార్య అంటే ఇష్టం లేదంటాడని, త్వరలోనే విడాకులు తీసుకుంటానని నమ్మిస్తాడని నీనా గుప్తా తెలిపారు. అతని మాటలను నమ్మిన నీవు... అతన్ని రహస్యంగా కలుస్తూ, ఏకాంతంగా గడుపుతావని... అలా చాలా రోజులు గడిచిపోతాయని చెప్పారు. నీవు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాక అతను చిరాకు పడతాడని... నీవు వాస్తవం గ్రహించేసరికి అతను దూరమవుతాడని అన్నారు. తన జీవితంలో కూడా ఇదే జరిగిందని... ఎంతో ఆవేదనను అనుభవించానని తెలిపారు. అందుకే అందరికీ చెబుతున్నానని... పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడొద్దని హెచ్చరిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో ద్వారా హితవు పలికారు.
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తో నీనా గుప్తా సహజీవనం చేశారు. వారికి ఓ బిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత రిచర్డ్స్ తో ఆమెకు మనస్పర్థలు రావడంతో... ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె మరొకరిని పెళ్లాడారు.