ఏడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఆర్బీఐ ప్రకటనతో బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 480 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 171 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
గత ఏడు సెషన్లుగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా తగు చర్యలు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 480 పాయింట్లు లాభపడి 38,624కి పెరిగింది. నిఫ్టీ 171 పాయింట్లు పుంజుకుని 11,303 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (7.36%), టాటా స్టీల్ (6.48%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.67%), ఓఎన్జీసీ (4.38%), ఎన్టీపీసీ (4.23%).
   
టాప్ లూజర్స్:
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (-0.77%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.06%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి.


More Telugu News