జగన్ కు బీసీలంటే గిట్టదు: ఆనందబాబు
- జగన్ ను బీసీ వ్యతిరేకిగా అభివర్ణించిన టీడీపీ సీనియర్ నేత
- బీసీల రిజర్వేషన్ అంశం వీగిపోయేలా చేశారని ఆరోపణ
- బీసీ రిజర్వేషన్ తేలాకే స్థానిక ఎన్నికలు చేపట్టాలని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు మరోసారి ధ్వజమెత్తారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అమరావతికి మద్దతుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు టీడీపీ సీనియర్ నేతలు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కా మాట్లాడుతూ, జగన్ బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు. జగన్ కు బీసీలంటే గిట్టదని, సొంత కేసుల్లో న్యాయవాదుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న జగన్, బీసీల రిజర్వేషన్ల అంశంపై ఎందుకు సరైన వాదనలు వినిపించడంలేదని ప్రశ్నించారు.
కోర్టులో సరైన వాదనలు వినిపించకుండా రిజర్వేషన్లు వీగిపోయేలా చేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది జగన్ అనుచరుడేనని ఆనందబాబు ఆరోపించారు. సమాజంలో సగం మంది బీసీలను జగన్ మళ్లీ మోసం చేశారని, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ విషయం రుజువైందని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ వాటా తేలాకే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.