'వైరస్ కలకలం రేపుతున్న ఈ తరుణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు' అంటూ వీడియో పోస్ట్ చేసిన సుమ
- జాగ్రత్తలు చెబుదామని వచ్చాను
- నేను ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా?
- సమస్యలు ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ ఉన్నట్లు కాదు
- మన భారతీయ సంస్కృతి విధానాలను పాటిద్దాం
కరోనా వైరస్ భయం తెలుగు ప్రజలకు పట్టుకున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు యాంకర్ సుమ ఓ వీడియో విడుదల చేసింది. 'వైరస్ కలకలం రేపుతున్న ఈ తరుణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తలు చెబుదామని వచ్చాను. నేను ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా?' అని ప్రశ్నించింది.
'జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం జీర్ణకోశ సమస్యలు ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ ఉన్నట్లు కాదు. కాకపోతే వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. మన భారతీయ సంస్కృతి విధానంలో ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాం' అని తెలిపింది.
'బాగా ఉడకబెట్టిన ఆహారపదార్థాలు తింటాం. ఇవన్నీ మళ్లీ అలవాటు చేసుకోవడం మొదలు పెడదాం. వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. శుభ్రతే వైరస్‌కు చక్కటి మందు. ఓకే.. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి.. హ్యాపీ డే..' అని సుమ వ్యాఖ్యానించింది.