పెళ్లికూతురైన రక్షిత... బళ్లారి శ్రీరాములు ఇంట సందడే సందడి!

  • 5వ తేదీ గురువారం వివాహం
  • బెంగళూరు ప్యాలెస్ ను అలంకరించిన ఆర్ట్ డైరెక్టర్లు
  • అతిథుల కోసం స్టార్ హోటల్స్ లో గదులు
ఈ నెల 5వ తేదీ, గురువారం నాడు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం బెంగళూరు ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా రక్షితను పెళ్లి కూతురిని చేశారు. ఈ వేడుక బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. బళ్లారిలోని హవంబావిలో ఉన్న శ్రీరాములు స్వగృహంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగింది.

అంతకుముందు శ్రీరాములు దంపతులు దగ్గర్లోని కనకదుర్గ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై కుటుంబమంతా బెంగళూరుకు తరలి వెళ్లారు. సుమారు 40 ఎకరాల ప్రాంగణమున్న బెంగళూరు ప్యాలెస్ లో వివాహ వేదికను ఆర్ట్ డైరెక్టర్లు అందంగా తీర్చిదిద్దారు. పెళ్లికి తరలివచ్చే వీఐపీలు, బంధు మిత్రులు, ఆహ్వానితుల కోసం పలు స్టార్ హోటల్స్ లో రూమ్స్ బుక్ చేశారు.


More Telugu News