మీరు తెగ ఆయాస పడుతున్నారు విజయసాయిరెడ్డి గారు: బుద్ధా వెంకన్న
- బీసీలకు వ్యతిరేకంగా కేసు వేయించారు
- ఇప్పుడు తెలుగుదేశం కేసు వేయించింది అని అంటున్నారు
- బీసీల చెవిలో క్యాబేజి పెట్టాలనుకుంటున్నారు
- మొన్నటి వరకూ ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు
బీసీల గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బయటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు' అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
దీనిపై స్పందించిన బుద్ధా వెంకన్న 'రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డితో బీసీలకు వ్యతిరేకంగా కేసు వేయించి ఇప్పుడు తెలుగుదేశం కేసు వేయించింది అని బీసీల చెవిలో క్యాబేజి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ గారు, మీరు తెగ ఆయాస పడుతున్నారు విజయసాయిరెడ్డి గారు' అని ట్వీట్ చేశారు.
'మొన్నటి వరకూ ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు ఇప్పుడు ఏకంగా క్యాబేజి పెట్టాలని ప్రయత్నం. బీసీలపై జగన్ గారికి అంత చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బాధగా ఎన్నికలు పెడతా అనడం ఏంటి? సుప్రీం కోర్టుకి వెళ్లి బీసీలకు న్యాయం చేయండి' అని బుద్ధా వెంకన్న సవాలు విసిరారు.