కరోనా కలకలంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. కీలక చర్చలు
- తెలంగాణలో కరోనా అనుమానిత కేసులు
- రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
- హైదరాబాద్‌లో అధికారులతో మంత్రుల భేటీ
- చేపట్టాల్సిన చర్యలపై చర్చ
తెలంగాణలో కరోనా అనుమానిత కేసులు నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో పురపాలక, పంచాయతీ రాజ్, వైద్య శాఖ అధికారులతో పాటు పలు శాఖల కార్యదర్శులతో తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌తో కూడిన సబ్ కమిటీ భేటీ అయింది.
అధికారులతో మంత్రులు సమీక్ష జరుపుతున్నారు. ఇందులో ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పరంగా కరోనా నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు.