విమానంలోనూ ఇక ఇంటర్నెట్, కాల్స్... అనుమతినిచ్చిన కేంద్రం!
- పౌర విమానయాన శాఖ నోటిఫికేషన్ విడుదల
- పైలట్ - ఇన్ - కమాండ్ అనుమతి తప్పనిసరి
- సేవలను ప్రారంభించనున్న విస్తారా ఎయిర్ లైన్స్
ఇకపై విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనూ, స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ చూస్తూ, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందుకు సంబంధించి, విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేలా, పౌర విమానయాన శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విమానంలో ఇంటర్నెట్ సేవలు వినియోగించుకునేందుకు పైలట్ - ఇన్ - కమాండ్ అనుమతి తప్పనిసరి. వైఫై ద్వారా ల్యాప్ టాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్, ఈ రీడర్ వంటి డివైజ్ లను వినియోగించుకోవచ్చు. ఏ వాడకమైనా ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం ఉండాలి.
కాగా, పౌర విమానయాన శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ కు ఏవియేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆమోదం తెలిపితే, ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఇప్పటికే విస్తారా ఎయిర్ లైన్స్ ఈ సదుపాయాన్ని కల్పించే తొలి విమానయాన సంస్థ కానుంది. ఈ సంస్థ తమ తొలి బోయింగ్ విమానాన్ని ఇటీవలే వాషింగ్టన్ లో డెలివరీ తీసుకుంది. ఇన్ ఫ్లయిట్ వైఫై సేవలను తాము ప్రారంభించనున్నామని ఆ సంస్థ సీఈఓ మీడియాకు వెల్లడించారు.