నా దైవానికి విశ్వాస పాత్రుడిని: పవన్‌ కల్యాణ్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • పవన్  సినిమాకి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు? అంటూ ట్విట్టర్‌లో పోల్‌
  • బండ్ల గణేశ్‌కు అత్యధిక ఓట్లు
  • 'జై పవన్‌ కల్యాణ్‌' అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ 
'పవన్ కల్యాణ్‌ సినిమాకి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు?' అంటూ ట్విట్టర్‌లో ఒకరు నిర్వహించిన పోల్‌లో తనకు చాలా మంది ఓటు వేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేస్తూ 'జై పవన్‌ కల్యాణ్‌' అని ట్వీట్ చేశారు. 'మీ అభిమానానికి కృతజ్ఞుడిని. ఎల్లవేళలా నా దైవానికి విశ్వాస పాత్రుడిని' అంటూ బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

కాగా,  బండ్ల గణేష్⁦ 'పవన్ కల్యాణ్‌ సినిమాకి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు?' అంటూ ఒకరు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో ఏఎం రత్నంకు 14 శాతం, బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు 8 శాతం, బండ్లగణేశ్‌కు 51 శాతం, దిల్‌ రాజుకు 27 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేశ్ గతంలో ఎంతగా పొగడ్తల వర్షం కురిపించేవారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.


More Telugu News