చైనా నుంచి వచ్చిన ఓడ.. దిగేందుకు ఎవరినీ అనుమతించని అధికారులు

  • ఇండియాలో కరోనా కేసుల కలకలం
  • దేశంలోని అన్ని ఓడరేవుల్లో హైఅలర్ట్
  • పారాదీప్ ఓడరేవులో చైనా నౌకకు అనుమతి నిరాకరణ
మన దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కలకలం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు, కరోనా భయాలతో దేశంలోని అన్ని ఓడరేవుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. 60కి పైగా దేశాలకు కరోనా సోకిన నేపథ్యంలో, ఆ వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా పోర్టుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా చైనా నుంచి బయల్దేరిన ఓ కార్గో నౌక పారాదీప్ పోర్టుకు చేరుకుంది. దాన్ని సముద్రంలోనే నిలిపివేసిన పోర్టు అధికారులు.. ఓడలోని వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఎవరికీ కరోనా వైరస్ లేదని తేలినప్పటికీ... వారిని పోర్టులో దిగేందుకు మాత్రం అనుమతించలేదు. మరోసారి వారందరికీ థర్మల్ స్కాన్ చేయిస్తామని... ఆ తర్వాతే పోర్టులో దిగేందుకు వారికి అనుమతిస్తామని పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ రింకీశ్ రాయ్ తెలిపారు.


More Telugu News