బాలయోగి నాకు అత్యంత ఆత్మీయులు: చంద్రబాబు నివాళులు
- బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుందాం
- అమలాపురం నుంచి ఢిల్లీకి స్వయంకృషితో ఎదిగిన మేధావి ఆయన
- ఆదర్శవంతమైన రాజకీయాలకు, వ్యక్తిత్వానికి మారుపేరు
దివంగత టీడీపీ నేత, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను స్మరించుకున్నారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయులని చెప్పారు. అమలాపురం నుంచి ఢిల్లీకి స్వయంకృషితో ఎదిగిన మేధావి అని, ఆదర్శవంతమైన రాజకీయాలకు, వ్యక్తిత్వానికి మారుపేరని కొనియాడారు.
కోనసీమ అభివృద్ధి ప్రదాతగా, లోక్ సభకు తొలి దళిత స్పీకర్ గా ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారని అన్నారు. బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ నేత ఆశయాలను స్మరించుకుందామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజానీకానికి అండగా ఉందామని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేద్దామని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.