ఎయిరిండియా కొనుగోలుకు విస్తారా ఎయిర్‌లైన్స్ ఆసక్తి

  • ఎయిరిండియాలోని వందశాతం వాటాల విక్రయానికి ప్రభుత్వం రెడీ
  • మదింపు చేస్తున్నామన్న భాస్కర్ భట్
  • కొంటామా? లేదా? అన్నది తర్వాతి విషయమన్న ‘విస్తారా’ చైర్మన్
సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొనుగోలుకు విస్తారా ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపుతోంది. సంస్థలోని వందశాతం వాటాలను విక్రయించనున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విస్తారా చైర్మన్ భాస్కర్ భట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విస్తారా ఎయిర్‌లైన్స్‌లోకి నిన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ వచ్చి చేరింది. ఈ సందర్భంగా భాస్కర్ భట్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియాను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ అంశాన్ని మదింపు చేస్తున్నామని, ఆ తర్వాత బిడ్డింగ్ గురించి ఆలోచిస్తామని అన్నారు. ఆసక్తి ఉందని, కొనుగోలు చేస్తామా? లేదా? అన్నది ఆ తర్వాతి సంగతని భాస్కర్ భట్ పేర్కొన్నారు.


More Telugu News