కరోనా బాధితుడికి ఊపిరితిత్తులు మార్చిన చైనా వైద్యులు

  • 59 ఏళ్ల వ్యక్తికి ఊరితిత్తుల మార్పిడి ఆపరేషన్
  • బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరణ
  • ఐదు గంటలపాటు శస్త్రచికిత్స
కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న 59 ఏళ్ల వ్యక్తికి చైనా వైద్యులు ఊపిరితిత్తులు మార్పిడి ఆపరేషన్ చేశారు. జింగ్సు ప్రావిన్స్‌ వూక్సి నగరంలోని పీపుల్స్‌ ఆసుపత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. బాధితుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

జనవరి 26న అతడు కరోనా వైరస్ బారినపడినట్టు తేలింది. అయితే, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆ లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. అయితే, అతడి శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిన్నట్టు గుర్తించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయిన మరో వ్యక్తి నుంచి ఊపిరితిత్తులు సేకరించి అతడికి అమర్చారు. ఐదు గంటలపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైనట్టు వైద్యులు తెలిపారు. కాగా, కరోనా బాధితుడికి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి.


More Telugu News