విశాఖలో బలవంతపు భూసేకరణ జరుగుతోంది: నాదెండ్ల మనోహర్​ ఆరోపణ

  • బాధిత రైతులకు తమ పార్టీ అండగా ఉంటుంది
  • విశాఖలో బాబును అడ్డుకున్న ఘటనలో పోలీసుల తీరు దారుణం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తాం
విశాఖ జిల్లాలో బలవంతపు భూసేకరణ జరుగుతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బాధిత రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఇటీవల అడ్డుకున్న ఘటనపై ఆయన స్పందించారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

కాగా, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్టణంలో ప్రారంభమైన ఈ సమావేశాల్లో జనసేన నేత, పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సమావేశాలకు వేదిక అయిన నోవాటెల్ హోటల్ వరకు కార్లు, బైక్ లతో ర్యాలీగా నాదెండ్ల వెంట వెళ్లారు.  


More Telugu News