గోమూత్రం, పేడతో కరోనా పారిపోతుందన్న బీజేపీ మహిళా ఎమ్మెల్యే

  • అసెంబ్లీలో కరోనా గురించి మాట్లాడిన అసోం మహిళా ఎమ్మెల్యే 
  • గోమూత్రం, పేడ క్యాన్సర్ ను కూడా తరిమికొడతాయని వెల్లడి
  • బంగ్లాదేశ్ మన ఆవులను వధిస్తోందంటూ ఆగ్రహం
కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేయాలని యావత్ ప్రపంచం తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో అసోంకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ శాసనసభ్యురాలు సుమన్ హరిప్రియ అసెంబ్లీలో మాట్లాడుతూ, గోమూత్రం, గోవు పేడతో కరోనా వైరస్ మహమ్మారి ఆమడదూరం పారిపోతుందని అన్నారు. గోమూత్రం, పేడ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని కూడా తరిమికొడతాయని పేర్కొన్నారు. గోమూత్రం చల్లితే ఆ ప్రాంతం ఎలా శుభ్రపడుతుందో అందరికీ తెలుసని, కరోనా వైరస్ పై కూడా గోమూత్రం, పేడ ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు.

పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ మన దేశం నుంచి ఆవులను అక్రమ రవాణా చేస్తోందని, మన ఆవులను మాంసం కోసం తీసుకెళుతూ బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎంతో బలపడిందని చెప్పారు. ఇవాళ ప్రపంచంలోనే పశుమాంసం ఎగుమతిదారుల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉందని వివరించారు. వారు వధిస్తున్న ఆవులన్నీ మనవేనని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు.


More Telugu News