నిర్భయ దోషుల ఉరిపై స్టే ఇవ్వడం పట్ల ఘాటుగా స్పందించిన ఆశాదేవి

  • పవన్ గుప్తా పిటిషన్ పై విచారణ జరిపి స్టే ఇచ్చిన పాటియాలా హౌస్ కోర్టు
  • దోషులను ఇంకెప్పుడు ఉరితీస్తారంటూ ప్రశ్నించిన నిర్భయ తల్లి
  • వ్యవస్థలోని లోపాలను ఇది ఎత్తిచూపుతోందని వ్యాఖ్యలు
నిర్భయ దోషులు ఉరి అమలును ఆలస్యం చేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లతో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే ఇచ్చింది. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. దోషులను ఉరితీసేది ఇంకెప్పుడంటూ ప్రశ్నించారు. న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఎందుకింత సమయం పడుతోందని అన్నారు. ఉరిశిక్ష అనేక పర్యాయాలు వాయిదా వేయడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి అమలు చేయాల్సి ఉంది. దోషుల్లో అందరికంటే చిన్నవాడైన పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేయడంతో పాటియాలా హౌస్ కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.​


More Telugu News