జగన్ అప్పగించిన బాధ్యతలను దండుపాళ్యం గ్యాంగులా పూర్తిచేస్తున్నారు: వలంటీర్లపై లోకేశ్ సెటైర్

  • వలంటీర్లను భేష్ అంటూ అభినందించిన వైసీపీ హైకమాండ్
  • ట్విట్టర్ లో వ్యంగ్యం ప్రదర్శించిన లోకేశ్
  • వలంటీర్లు ఏంచేసినా వైసీపీ ఆశీస్సులున్నాయని అర్థమవుతోందంటూ ట్వీట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థపై స్పందించారు. రాష్ట్రంలో 90 శాతం వైసీపీ కార్యకర్తలే వలంటీర్లుగా కొనసాగుతున్నారని ట్వీట్ చేశారు. వారు రేపులు చేసినా, పాపాలు చేసినా వైసీపీ ఆశీస్సులున్నాయని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. జగన్ అప్పగించిన బాధ్యతలను దండుపాళ్యం గ్యాంగులా పూర్తిచేస్తున్న వలంటీర్లకు వైసీపీ అధినాయకత్వం హ్యాట్సాఫ్ చెప్పడంలో వింతేముంది అంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో వలంటీర్లపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. 'గ్రామ వలంటీరు నిర్వాకం', 'అమ్మఒడి సొమ్ము కాజేసిన వలంటీర్', 'మహిళను వేధించిన వలంటీర్', 'వివాహితపై వలంటీరు అత్యాచారయత్నం' అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హెడ్డింగులను పేర్కొన్న లోకేశ్, చివరగా విజయసాయిరెడ్డి హ్యాట్సాఫ్ అంటూ అభినందిస్తుండడాన్ని కూడా ట్విట్టర్ లో పొందుపరిచారు.


More Telugu News