హైకోర్టు తీర్పుపై ఏపీ సర్పంచుల సంఘం హర్షం

  • ‘స్థానిక’ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవో కొట్టివేతపై స్పందన
  • రిజర్వేషన్లు 50 % దాటకూడదని తెలిసీ ప్రభుత్వం ముందుకెళ్లింది
  • స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించాలని డిమాండ్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర సర్పంచుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిసి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపటప్రేమ చూపిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు.


More Telugu News